15 ఏప్రి, 2012

ఔషధమా?? చేతబడా??

భారతీయులు అత్యంత మేధా శక్తి కలిగిన వారు. ముఖ్యంగా మన పూర్వీకులు, ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి, చేసిన ప్రతి పనినీ గ్రంధస్తం చేశారు. అలా చేసిన గ్రంధాలనే వేదాలుగా పరిగణిస్తున్నాం అని పెద్దలు చెప్పగా విన్నాను. అలాంటి వేదాల నుంచే చేతబడి, బాణామతి వంటి క్షుద్ర విద్యలు కూడా వచ్చాయని విన్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. ఆలోచించగా, మనిషి తనకు మంచి చేసే వాటినే గ్రంధస్తం చేసి ఉంటాడు కదా అనిపించింది. 

చేతబడి, కాష్మోర లాంటి విద్యలు గురించి విన్న తరువాత ఇలాంటి విద్యలు నిజంగానే ఉంటాయా? ఉంటే ఎంతవరకు అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. మనిషికి ఏ మాత్రం శారీరిక లేక మానసిక సంబంధం లేకుండా మనిషిని హింస పెట్టె అవకాశం లేదు. Hypnotism అనుకున్నా అందులో మనిషి తో ఒక్క సారి అయినా ముఖా ముఖి మాట కలిసి ఉండాలి. కాబట్టి ఈ విద్యలలోను అలాంటిదే జరుగుతూ ఉండి ఉండాలి.

పూర్వీకులు ఔషధాలు మొత్తం అడవులలో పెరిగే చెట్ల నుంచే తయారు చేసే వారని అలా చేసి గ్రంధస్తం చేసిన దానికే తరువాత ఆయుర్వేదం అని పేరు వచిందని అందరికి తెలిసిన విషయమే. అలా తయారు చేసే ఔషధాలలో, చాలా వరకు మౌలికమైన మూలికలు, ధాతువులు విష పూరిత మైనవే. అటువంటి వాటిని మిశ్రమం చెయ్యటం ద్వారా ఒక ప్రత్యేకమైన ఔషధాలను తయారు చెయ్య గలిగేవారు.

ఇలాంటి ఔషధాన్ని మన పూర్వీకులలో ఒకరు తను చేసిన పరిశోధనని తన వద్ద ఉన్న శిష్యులు లేక తెలిసిన వారి మధ్య ప్రదర్శిస్తూ, తను కనిపెట్టిన ఔషధం రోగి కి  ఇచ్చి తనకు కలిగిన బాధను విశదీకరించటం కోసం ఒక మనిషి ఆకారం లో ఉన్న బొమ్మను తయారు చేసి, బాధ కలిగిస్తున్న ప్రాంతాన్ని సూచించటం కోసం సూది లోపలకి గుచ్చి  అర్థం అయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేసి ఉండ వచ్చు. అలాంటి ఔషధం ఇచ్చినపుడు అది వికటించి ఉండవచ్చు, లేదా ఔషధం పని చేస్తున్న సమయం లో రోగి లో ఉన్న చెడు రక్తం బయటకు వచ్చి ఉండవచ్చు, ఇలా సగం సగం చూసి నేర్చుకొన్న లేదా తెలుసుకున్న ప్రజలు, అదేదో వింత విద్య అని అలా చేసి మనుషులని చంపెయ్య వచ్చనే భావన కి వచ్చి ఉండ వచ్చు. దానికే చేతబడి అని పేరు వచిందేమో అని నా భావన.

చేతబడి చేసే వారు, చేయ బడే వారికి ఏదో ఒక రూపంగా వికటించే ఔషధ మిశ్రమాన్ని ఇచ్చిన తరువాత, ఆ మిశ్రమం ఈ శరీరం లో ఏ ప్రాంతాన్ని వికటింప చేస్తుందో తెలుసుకొని ఆ ప్రాంతం లోనే ఆ మట్టి బొమ్మకు సూదిని గుచ్చుతారు. కాబట్టి చూసే వారికి ఆ సూదిని గుచ్చటం వలననే ఆ పీడితుడి నరాలు తెగి మరణించాడని భావిస్తారు.

ఎక్కువ శాతం క్షుద్ర విద్యలు, కొంతమంది పూర్వీకుల అజ్ఞానం లేక మూఢ ఆచారాల వల్ల వచినవే కానీ అవేమి ప్రత్యేకమైన విద్యలు కావు. 

కనిపెట్టింది(మన మాటలలో ఔషధం) మానవ జీవనానికి ఉపయోగ పడేది అయినా కూడా, చూసిన లేక నేర్చుకున్న అజ్ఞానుల కారణం గా అవి ప్రజలలో దుష్ప్రాచుర్యం పొంది, క్షుద్ర విద్యలుగా మిగిలి ఉంటాయనేది నా ప్రగాఢ విశ్వాసం.