15 ఏప్రి, 2012

ఔషధమా?? చేతబడా??

భారతీయులు అత్యంత మేధా శక్తి కలిగిన వారు. ముఖ్యంగా మన పూర్వీకులు, ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి, చేసిన ప్రతి పనినీ గ్రంధస్తం చేశారు. అలా చేసిన గ్రంధాలనే వేదాలుగా పరిగణిస్తున్నాం అని పెద్దలు చెప్పగా విన్నాను. అలాంటి వేదాల నుంచే చేతబడి, బాణామతి వంటి క్షుద్ర విద్యలు కూడా వచ్చాయని విన్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. ఆలోచించగా, మనిషి తనకు మంచి చేసే వాటినే గ్రంధస్తం చేసి ఉంటాడు కదా అనిపించింది. 

చేతబడి, కాష్మోర లాంటి విద్యలు గురించి విన్న తరువాత ఇలాంటి విద్యలు నిజంగానే ఉంటాయా? ఉంటే ఎంతవరకు అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. మనిషికి ఏ మాత్రం శారీరిక లేక మానసిక సంబంధం లేకుండా మనిషిని హింస పెట్టె అవకాశం లేదు. Hypnotism అనుకున్నా అందులో మనిషి తో ఒక్క సారి అయినా ముఖా ముఖి మాట కలిసి ఉండాలి. కాబట్టి ఈ విద్యలలోను అలాంటిదే జరుగుతూ ఉండి ఉండాలి.

పూర్వీకులు ఔషధాలు మొత్తం అడవులలో పెరిగే చెట్ల నుంచే తయారు చేసే వారని అలా చేసి గ్రంధస్తం చేసిన దానికే తరువాత ఆయుర్వేదం అని పేరు వచిందని అందరికి తెలిసిన విషయమే. అలా తయారు చేసే ఔషధాలలో, చాలా వరకు మౌలికమైన మూలికలు, ధాతువులు విష పూరిత మైనవే. అటువంటి వాటిని మిశ్రమం చెయ్యటం ద్వారా ఒక ప్రత్యేకమైన ఔషధాలను తయారు చెయ్య గలిగేవారు.

ఇలాంటి ఔషధాన్ని మన పూర్వీకులలో ఒకరు తను చేసిన పరిశోధనని తన వద్ద ఉన్న శిష్యులు లేక తెలిసిన వారి మధ్య ప్రదర్శిస్తూ, తను కనిపెట్టిన ఔషధం రోగి కి  ఇచ్చి తనకు కలిగిన బాధను విశదీకరించటం కోసం ఒక మనిషి ఆకారం లో ఉన్న బొమ్మను తయారు చేసి, బాధ కలిగిస్తున్న ప్రాంతాన్ని సూచించటం కోసం సూది లోపలకి గుచ్చి  అర్థం అయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేసి ఉండ వచ్చు. అలాంటి ఔషధం ఇచ్చినపుడు అది వికటించి ఉండవచ్చు, లేదా ఔషధం పని చేస్తున్న సమయం లో రోగి లో ఉన్న చెడు రక్తం బయటకు వచ్చి ఉండవచ్చు, ఇలా సగం సగం చూసి నేర్చుకొన్న లేదా తెలుసుకున్న ప్రజలు, అదేదో వింత విద్య అని అలా చేసి మనుషులని చంపెయ్య వచ్చనే భావన కి వచ్చి ఉండ వచ్చు. దానికే చేతబడి అని పేరు వచిందేమో అని నా భావన.

చేతబడి చేసే వారు, చేయ బడే వారికి ఏదో ఒక రూపంగా వికటించే ఔషధ మిశ్రమాన్ని ఇచ్చిన తరువాత, ఆ మిశ్రమం ఈ శరీరం లో ఏ ప్రాంతాన్ని వికటింప చేస్తుందో తెలుసుకొని ఆ ప్రాంతం లోనే ఆ మట్టి బొమ్మకు సూదిని గుచ్చుతారు. కాబట్టి చూసే వారికి ఆ సూదిని గుచ్చటం వలననే ఆ పీడితుడి నరాలు తెగి మరణించాడని భావిస్తారు.

ఎక్కువ శాతం క్షుద్ర విద్యలు, కొంతమంది పూర్వీకుల అజ్ఞానం లేక మూఢ ఆచారాల వల్ల వచినవే కానీ అవేమి ప్రత్యేకమైన విద్యలు కావు. 

కనిపెట్టింది(మన మాటలలో ఔషధం) మానవ జీవనానికి ఉపయోగ పడేది అయినా కూడా, చూసిన లేక నేర్చుకున్న అజ్ఞానుల కారణం గా అవి ప్రజలలో దుష్ప్రాచుర్యం పొంది, క్షుద్ర విద్యలుగా మిగిలి ఉంటాయనేది నా ప్రగాఢ విశ్వాసం.

6 మార్చి, 2009

దెయ్యాల కార్ఖానా

సాయంత్రం నుంచి రాత్రిగా మారబోతున్న క్షణాలు అవి. వేణు తన కాళ్ళను ఈడుస్తూ నడుస్తున్నాడు ఇంటి వైపు. ఎప్పటి లాగా జోవీయల్ గా లేదు ఆ నడక. నడకలో తన మనోభారం ప్రతి బింబిస్తోంది. మొహం నేల వైపు కి పెట్టి ఏదో ఆలోచనలో ఉన్న వాడి లాగా నడుస్తున్నాడు. బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి, కానీ అవి అన్ని నిద్ర పోతున్న వాడి పక్క గదిలో దిస్కోథెక్ జరుగుతున్నట్టుగా subconscious మైండ్ లో గొడవ చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తన మెదడు ఇప్పుడు నిరాలోచనగా ఉంది. అలానే ఇంటి వరకు వచ్చాడు. రెండంతస్తుల భవనం అది. అందులో 2వ ఫ్లోర్ లో అద్దెకు ఉంటున్నాడు వేణు. మెట్లు ఎక్కటానికి కాలు ఎత్తటానికి మెదడు నుంచి సంజ్ఞలు రావటం లేదు. కళ్ళ ముందు తెరలు కమ్మినట్టుగా ఉన్నాయి. ట్రై చేద్దాం అని తన మెదడు పక్క గదిలో జరుగుతున్న గోల చూడటానికి తలుపు తీశాడు. వెంటనే ఒక చెంప దెబ్బ తగిలింది. దానితో ఈ లోకంలోకి వచ్చిన వేణు కి, తాను మెట్టు కి తట్టుకున్నాను అని అర్థం అయింది. అలా షాక్ నుంచి తేరుకోగానే మెట్లు ఎక్కాలనే సంజ్ఞలు పాస్ అయినట్టుగా ఉన్న అతని కాళ్ళు అతను పైకి వెళ్ళటానికి సహాయ పడ్డాయి.

తాను ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉంది. ఇంకా మెదడులో కాళ్ళకి ఇచిన ఆజ్ఞలు తప్ప మరి ఏ ఆలోచనలు లేకపోవటంతో అలాగే నించుండి పొయ్యాడు బ్యాటరీ అయిపోయిన మర బొమ్మ లా. ఇంతలో మళ్ళీ మెదడు పక్క గది తలుపు తెరిచాడు, చెవులు దద్దరిల్లే వూఫర్స్, లౌడ్ స్పీకర్స్ నుంచి వచ్చే ధ్వని ని తాళ లేక పోతున్నాడు. ఇంత ధ్వని లోనుంచి కూడా అతనికి ఒక మగ గొంతు వినిపిస్తోంది చిన్నగా. అటు వైపు తిరిగి చూసాడు, అక్కడ డాన్స్ చేస్తున్న ఒక వ్యక్తి వేణు వైపు చూసి మాట్లాడుతున్నాడు. “ఒరేయ్, నేను ఈవినింగ్ రావటానికి లేట్ అవుతుంది కాబట్టి రూమ్ కీ నువ్వు తీసుకెళ్లు” అని వేణు జేబులో వేశాడు తాళం చెవిని. ఆ తాళం చెవి జేబులో పడుతూ ఉండటం చూసి కళ్ళు పైకి తిప్పుకొనే వ్యవధిలో అతను నేల వైపుకి చూసాడు, అక్కడ ఏమీ కన పడ లేదు, దానితో అతనికి భయం వేసి పడిపోతున్నాను అనుకుంటూ ఉండగానే ఏదో ఘన పదార్ధానికి గట్టిగా తాడనం చెందినట్టు అనిపించింది. ఆ షాక్ తో ఈ లోకం లో కి వచ్చిన వేణు తన జేబులో చెయ్యి పెట్టి తాళం చెవి బయటకి తీసి తన గది తాళం తీశాడు. గది లోకి అడుగు పెడుతూనే సరాసరి బాత్రూమ్ కి వెళ్ళి కాళ్ళు కడుక్కొనే అలవాటు ఉన్న వేణు, ఆ రోజు మాత్రం తలుపు పక్కనే ఉన్న నవారు కుర్చీ లో కూల బడ్డాడు.

కాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను కూడా బలవంతంగా ఆపెయ్యటం తో మళ్ళీ ఖాళీ అయిన బుర్రతో అలా కూర్చున్న వేణు మెదడు తలుపు ఎవరో కొట్టారు. అది ఆ పక్కన ఉన్న subconcious మైండ్ నుంచి వచ్చిన వాళ్ళే కొట్టి ఉంటారు. తలుపు తీసిన వేణు ఎదురుగా తనతో 10 నెలలుగా పని చేస్తున్న తన పై అధికారి కనిపించాడు. అతను వేణు మొహం వైపు వేలు పెట్టి “
You are laid off ” అని అరిచాడు. అతని చూపుడు వేలు అదుపు తప్పి కంట్లో పొడుచుకోవటంతో కళ్ళు ఆర్పిన వేణు చెమ్మ గిల్లిన కళ్ళు తెరచి చూసే సరికి ఈ లోకం లో కి వచ్చాడు. చెమ్మ గిల్లిన కళ్ళతోనే కుర్చీ లో నుంచి లేచి బాత్‌రూమ్ వైపు నడిచాడు.

ఐదు నిమిషాల తరువాత రిఫ్రెష్ అయి బాత్రూం బయటకు వచిన వేణు తన ల్యాప్‌టాప్ తీసుకొని మళ్ళీ కుర్చీ లో కూర్చున్నాడు. రిఫ్రెష్ అయి రావటం తో తన మెదడు పక్క గదిలో గోల కొంచెం తగ్గింది. అలాగే మెదడు గదిలో కొంతమంది కనిపించారు వాళ్ళని తన ఫ్రెండ్స్, చుట్టాలుగా గుర్తించాడు. అలాగే తాను బయటకు తీసిన ల్యాప్‌టాప్ వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఇలాంటి రోజుని ఎదుర్కొనటం వేణు కి మొదటి సారి కాదు. అతను జాబ్ ట్రైయల్స్ కోసం అని ఇంటర్‌వ్యూ కి వెళ్ళి వచిన ప్రతి సారి ఇలాగే జరుగుతున్నది. రెండు నెలల క్రితం recession బాగా ఉన్న టైమ్ లో అతను జాబ్ నుంచి తొలగించ బడ్డాడు. అతనిని ఉద్యోగం నుంచి తీసి వెయ్యటానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆ రోజు తో అతను చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, కనుక అతనికి మరొక ప్రాజెక్ట్ లో ఉద్యోగం చూపించలేము అని భావించిన కంపనీ మానేజ్మెంట్ అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ రెండు నెలల వ్యవధిలో 3 ఇంటర్‌వ్యూ లకి మాత్రమే హాజరు కా గలిగాడు వేణు. కారణం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక ని విరిచేసిన ఆర్థిక మాంద్యం. (ఇంకా ఉంది)...

7 ఫిబ్ర, 2009

నా మొదటి లేఖ

ఇదే నా మొదటి బ్లాగు లేఖ. వ్రాశాను మీకు చెప్ప లేక.